విరాట్ క్రికెటరా? బీజేపీ స్పోక్స్ పర్సనా?

విరాట్ క్రికెటరా? బీజేపీ స్పోక్స్ పర్సనా?

విరాట్ కోహ్లీ మీద విమర్శల వర్షం కురుస్తోంది. విరాట్ చెప్పుకోదగ్గ బ్యాట్స్ మన్ ఏమీ కాడని, అనవసరంగా అతనికి ఓవర్ రేటింగ్ ఇస్తున్నారని, అసలు విరాట్ ఆట కన్నా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆటతీరు ఎంతో బాగుంటుందంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ పై విరాట్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అసలు నువ్వు ఇండియాలో ఉండాల్సినవాడివే కాదన్నాడు. పోయి నీకు నచ్చిన వేరే దేశంలో బతుకు, నన్ను నువ్వు ఇష్టపడనంత మాత్రాన నాకేం పోయేది లేదు. ఇండియాలో ఉంటూ బయటి దేశస్తుల్ని పొగడటం నాకేం నచ్చలేదు. నీ ప్రయారిటీలేంటో సెట్ చేసుకో.. అంటూ ఆగ్రహించాడు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఇంటర్నెట్లో మండిపడుతున్నారు. నువ్వు విరాట్ వా.. లేక బీజేపీ అధికార ప్రతినిధివా.. నోర్మూసుకొని వెళ్లి ఆటాడుకో... అని రాహుల్ అనే ఓ అభిమాని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బీజేపీ స్పోక్స్ పర్సన్ నుంచి ఇంతకన్నా ఎక్కువేం ఆశిస్తాం.. అంటూ మరో అభిమాని సెటైర్ వేశాడు. 

నువ్వు విదేశాల్లో పెళ్లి చేసుకొని, విదేశాలను పొగిడి, కబడ్డీ కాకుండా విదేశీ ఆటనే ఆడుతూ మమ్మల్నే విదేశాలకు వెళ్లమంటావా.. అంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే విరాట్ కూడా పంతం వీడలేదు. నేను ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని లైక్ చేయడం, ఎండార్స్ చేయడం వల్ల నాకు డబ్బొస్తుంది. నీకేమొస్తుంది? నీకేమీ రానప్పుడు అరవడం ఎందుకు? నీకు నచ్చకపోతే నా సెంచరీలను కూడా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదని ఘాటుగానే రిప్లయి ఇచ్చాడు. ఈ సంవాదంతో విరాట్ ఇరుకున పడ్డట్టే కనిపిస్తోంది.