'ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌'లో అగ్ని ప్రమాదం

'ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌'లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గోడౌన్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున గోడౌన్‌ నుంచి పొగలు రావడంతో ప్రమాద విషయాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.