ప్లాస్టిక్ కంపెనీ నుంచి ఆయిల్‌ ఫ్యాక్టరీకి మంటలు

ప్లాస్టిక్ కంపెనీ నుంచి ఆయిల్‌ ఫ్యాక్టరీకి మంటలు

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది... కానూరులోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.... పెద్ద స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఇంతలో ప్లాస్టిక్ కంపెనీ నుంచి మంటలు పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలోకి కూడా విస్తరించాయి. దీంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది... ఆయిల్ కంపెనీలో వంద పీపాల వరకు ఆయిల్ ఉండడంతో మంటలు ఉధృతంగా ఎగసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... దాదాపు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 10 ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పివేశారు. అటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. పరిశ్రమలో ఉన్న కార్మికులను బయటకు తీసుకొచ్చాయి. అయితే కానూరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ముందు జాగ్రత్త చర్యగా కానూరులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.