సాధ్యమైనంత త్వరగా అణునిరాయుధీకరణ: ట్రంప్‌

సాధ్యమైనంత త్వరగా అణునిరాయుధీకరణ: ట్రంప్‌

ఉత్తర కొరియా పట్ల తమ విధానాన్ని మార్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో ఇవాళ జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాల నేతలు మీడియాతో మాట్లాడారు. భేటీ ఊహించినదానికంటే బాగా జరిగిందని అన్నారు. కిమ్‌తో జరిగిన ఈ భేటీ 'వెరీ వెరీ గుడ్‌' అని  పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన బంధం ఏర్పడిందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అణు నిరాయుధీకరణ దిశగా తొలి అడుగు పడిందని ట్రంప్‌ వివరించారు. కిమ్‌ను వైట్‌ హౌస్‌కు ఆహ్వానించారు.  సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్‌కు కిమ్‌ కృతజ్ఞతలు చెప్పారు. శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నానన్నారు. త్వరలోనే ప్రపంచం ఓ పెను మార్పును చూస్తుందని కిమ్ తెలిపారు. ఈ భేటీలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.  ఏ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియదు.