నిబంధనలు పాటించని బార్, రెస్టారెంట్లు సీజ్

నిబంధనలు పాటించని బార్, రెస్టారెంట్లు సీజ్

హైదరాబాద్ లోని బార్ అండ్ రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. అగ్ని ప్రమాద నివారణ నిబంధనలు పాటించని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లను జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మూసివేశారు. జూబ్లీహిల్స్‌లోని టికిషాక్స్‌, క్యాల‌న్‌గోట్ రెస్టోబార్‌, అర్బ‌నేషియా కిచెన్ అండ్ బార్‌, ఈట్ ఇండియా కంపెనీ, రాస్తాకేఫ్ అండ్ బార్‌ల‌ను సీజ్ చేశారు.