కుప్పకూలిన ఫ్లైఓవర్.. 18 మంది మృతి 

కుప్పకూలిన ఫ్లైఓవర్.. 18 మంది మృతి 

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద ఓ కారు, ప్రయాణికులతో కూడిన బస్సుతో పాటు పలు ద్విచక్రవాహనాలు కూరుకుపోయాయి.  ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ పిల్లర్లు కూలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.