నేడు టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే..

నేడు టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే..

ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి... మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది అధికారి టీడీపీ... పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీలో చేరికలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ సాయంత్రం కాండ్రు కమల టీడీపీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో కాండ్రు కమల మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఆమె... రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.