పాక్ కాల్పులు... నలుగురు మృతి

పాక్ కాల్పులు... నలుగురు మృతి

సరిహద్దులో పాకిస్థాన్ దాష్టికాలు ఆగడంలేదు. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ బలగాలు రెచ్చిపోతున్నాయి. గత అర్ధరాత్రి జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని చంబ్లియాల్ సెక్టార్‌లో పాక్ బలగాలు మరోమారు కాల్పులకు తెగబడ్డాయి. ఇరుదేశాల బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన పాక్ సైనికులు గస్తీ తిరుగుతున్న భారత బార్డర్ సెక్యూరిటీపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. కాల్పుల్లో మరో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లకు తీవ్ర  గాయాలయ్యాయి. ఇటీవల పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది.