గజ్వేల్‌ నుంచి గద్దర్ ఇండిపెండెంట్ గా పోటీ

గజ్వేల్‌ నుంచి గద్దర్ ఇండిపెండెంట్ గా పోటీ

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ ప్రకటించారు.తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్న ఆయన, ఈనెల 15న అదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తానన్నారు.  తనకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని సీఐడీ అడిషనల్ డైరెక్టర్‌ జనరల్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కోరారు. గజ్వేల్ నుంచి పోటీ చేయడమే కాకుండా  తెలంగాణలోని పల్లెపల్లెలో తిరుగుతానని చెప్పారు.