పవన్‌ నా దేవుడే.. కానీ..

పవన్‌ నా దేవుడే.. కానీ..

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి అతిపెద్ద వీరాభిమానినని పలు సందర్భాల్లో చెప్పిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌.. ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. పవన్‌కల్యాణ్‌ను 'దేవుడు' అని అభివర్ణించే గణేష్‌.. జనసేనలో చేరతారని పవన్‌ అభిమానులు భావించారు. కానీ ఆయన అనూహ్యాంగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ తనకు తండ్రి, దేవుడు, గురువు అన్నీ పవన్‌కల్యాణేనని అన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు అభిమానమని.. అందుకే ఆ పార్టీలో చేరానని చెప్పారు.