నయీమ్ భార్య అరెస్ట్  

నయీమ్ భార్య అరెస్ట్  

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో భాగంగా సిట్ పోలీసులు భార్య హసీనాను అరెస్ట్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం ఎన్ కౌంటర్ లో నయీమ్ మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిట్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. అందులో భాగంగా ఆయన భార్య హసీనాను అరెస్ట్ చేశారు. 

భువనగిరిలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు వెల్లడించారు. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత అతని కుటుంబీకుల్లో పలువురిని పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. నయీమ్ కోడలు, అల్లుడు, మరో అనుచరుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. విచిత్రంగా నయీం కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా  తవ్వుతున్నకొద్దీ మరిన్న నిజాలు బయటకు వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా హసీనాను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు.