బీజేపీలోకి గౌత‌మ్ గంభీర్‌?

బీజేపీలోకి గౌత‌మ్ గంభీర్‌?

క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ బీజేపీలోకి చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీ నుంచి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తార‌ని దైనిక్ జాగ‌ర‌ణ్ ప‌త్రిక పేర్కొంది.ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ఎప్ప‌టి నుంచో దూరంగా ఉన్న గంభీర్ ఇటీవ‌ల రాజ‌కీయ అంశాల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన అంశాల‌పై స్పందించ‌డం, వారి కుటుంబాల‌కు సాయం కూడా చేశారు. ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆయ‌న ఏ స్థానం నుంచి పోటీ చేస్తార‌నే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు.  ఇప్ప‌టికే క్రికెట‌ర్లు అజారుద్దీన్, మొహ‌మ్మ‌ద్ కైఫ్‌, న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, కీర్తి ఆజాద్‌లు రాజ‌కీయాల్లో ఉన్నారు.