ఆ ఒక్క పాటను మర్చిపోలేకపోతున్న గౌతమ్ మీనన్ !

ఆ ఒక్క పాటను మర్చిపోలేకపోతున్న గౌతమ్ మీనన్ !

దర్శకుడు గౌతమ్ మీనన్ కు  ఎంత మంచి మ్యూజిక్ సెన్స్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  ఆయన సినిమాల్లోని పాటల్ని చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది.  ఆయన సినిమా ఆల్బమ్స్ అన్నీ పెద్ద హిట్లే.  అలాంటి  డైరెక్టర్ కేవలం ఒక పాటను తెగ పొగిడేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 

ఆ పాట మరేదో కాదు మన తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న 'గీత గోవిందం' సినిమాలోని 'ఇంకేం ఇంకేం కావాలే' పాట.  ఈ పాటను గౌతమ్ మీనన్ కు తెగ నచ్చేసిందట.  దీంతో ఆయన దాన్ని రిపీట్ మోడ్ లో వింటూ 'ఈ సాంగ్ నా మైండ్ నుంచి పొవట్లేదు.  మంచి పాట, మంచి సంగీతం భాధను మర్చిపోయేలా చేస్తాయి' అంటూ పాట రాసిన అనంత శ్రీరామ్, పాడిన శ్రీరామ్, సంగీత అందించిన గోపిసుందర్ లను తెగ పొగిడేశారు.