రష్మిక బ్రేకప్ ..!!?

రష్మిక  బ్రేకప్  ..!!?

రష్మిక మందన టాలీవుడ్లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో మంచి హిట్ సాధించడంతో..గీత గోవిందం రూపంలో రెండో అవకాశం వచ్చింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు లక్కీ స్టార్ గా మారిపోయింది.  ప్రస్తుతం ఈ అమ్మడు నాగార్జున, నాని మల్టిస్టారర్ గా వస్తున్న దేవదాస్ లోను అలాగే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలోను నటిస్తూ బిజీగా మారిపోయింది.  

గతేడాది కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది.  సినిమాల్లో అవకాశాలు రావేమో అనుకోని పెళ్ళికి సిద్ధమైంది.  వరసగా రెండు పెద్ద హిట్స్ రావడంతో.. రష్మికకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే.. కెరీర్ కు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో రష్మిక వివాహాన్ని వాయిదా వేసుకున్నట్టుగా సమాచారం.  దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా.