రష్మిక అంతలా చేస్తుందా..?

రష్మిక అంతలా చేస్తుందా..?

ఛలో సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ గీత గోవిందం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  రష్మికను గీత గోవిందం సినిమాకు ఎంపిక చేసే ముందు దాదాపు 25 మంది హీరోయిన్లను ట్రై చేశారట.  కాని ఎందుకో ఈ సినిమాలో నటించేందుకు ఆయా హీరోయిన్లు మొగ్గు చూపలేదు.  చివరకు అవకాశం రష్మిక దగ్గరకు వచ్చింది.  వెంటనే ఒప్పుకున్న రష్మిక, అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది.  కథకు తగ్గట్టుగా గోవిందాన్ని ప్రేమిస్తూనే.. సీరియస్ గా ఉంటుంది.  ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది రష్మిక.  దీంతో ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.  

ఇప్పుడు రష్మిక సినిమాకు కోటి డిమాండ్ చేస్తుందట.  అయినప్పటికీ నిర్మాతలు ఏ మాత్రం ఆలోచించకుండా ఆమెను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.  గీత గోవిందంలో సీరియస్ గా ఉండే పాత్రలో కనిపించిన రష్మిక.. నిజజీవితంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుందట.  సెట్స్ లో చిన్నపిల్లలా అల్లరి చేస్తూ ఉంటుందట.  గీత గోవిందం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.