టీఆర్ఎస్ ఓటమి కోసం సర్దుకుపోయేందుకు సిద్దం

టీఆర్ఎస్ ఓటమి కోసం సర్దుకుపోయేందుకు సిద్దం

టీఆర్ఎస్ ఓటమి కోసం సర్దుకుపోయేందుకు సిద్దంగా ఉన్నాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. గురువారం రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... పొత్తుల విషయంలో గందరగోళం లేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లంటోంది.. 18 సీట్లైనా ఇవ్వాలని మేం పట్టుబడుతున్నామని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ఓటమి కోసం సర్దుకుపోయేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కోదండరామ్ మాటలను బట్టి ఆయనతో ఇబ్బంది ఉండకపోవచ్చు. కూటమి విచ్ఛిన్నం కాకూడదనే భావనతోనే కూటమిలోని పార్టీలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి  ప్రజలను బయటేసేందుకే.. సిద్దాంత విబేధాలున్నా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలతో టీడీపీ బలహీనపడిన మాట వాస్తవమే అని రేవూరి ప్రకాశ్ రెడ్డి అంగీకరించారు. ప్రజల్లో బలంగా ఉన్నా.. వ్యవస్ధాగతంగా పార్టీ ఇబ్బంది పడుతోంది. అందుకే నాతో సహా ఇంకొందరు నేతలకు సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదన్నారు. నేను కోరుతున్న నర్సంపేట టిక్కెట్టుపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గరున్న రిపోర్టుల ప్రకారమైనా సరే పరిస్థితి నాకే అనుకూలంగా ఉంది. నర్సంపేట్ స్థానం టీడీపీకే వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన పేరొన్నారు.