వైసీపీకి ఆదిశేషగిరిరావు గుడ్‌బై..

వైసీపీకి ఆదిశేషగిరిరావు గుడ్‌బై..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది... సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్‌బాబుకు బాబాయ్‌ అని ఆదిశేషగిరిరావు... అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణానికి వచ్చిన ఆయన... ఎన్టీవీతో మాట్లాడుడూ... రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. కొన్ని‌కారణాలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆదిశేశగిరిరావు... అందుకే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని... ఏ పార్టీలో చేరే విషయం త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.