బల్దియా పాలక మండలి మూడేళ్లు పూర్తి

బల్దియా పాలక మండలి మూడేళ్లు పూర్తి

జిహెచ్ఎంసి పాలక మండలి ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తి  చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ కటింగ్  కార్యక్రమం జరిగింది. హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, కమిషనర్ దాన కిషోర్,కార్పొరేటర్లు  హాజరయ్యారు. దేశంలో హైదరాబాద్ కు ప్రత్యేకత గుర్తింపు ఉందని కమిషనర్ దాన కిషోర్ అన్నారు. అభివృద్ధి పనుల్లో ఎన్నో అవార్డులను హైదరాబాద్ పాలక సంస్థ అందుకుంటుందని ఈ సందర్భంగా కమిషనర్ చెప్పుకొచ్చారు. అధికారులు రూల్స్ ప్రకారం పని చేసేలా..  తెలంగాణా ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన అన్నారు.