మేయర్ ఆకస్మిక తనిఖీలు

మేయర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ రోడ్డు పనులు జరిగే కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హెచ్ఆర్డీసీ పరిదిలో జరుగుతున్న రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్న తీరును పరిశీలించి తెలుసుకున్నారు.

హైదరాబాద్ నగర్ మేయర్ మియాపూర్ కూకట్ పల్లి వై జంక్షన్, కూకట్ పల్లి- ఉషా ముళ్లపూడిలో జరుగుతున్న పనుల నాణ్యతపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పనుల నాణ్యత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా మెరుగైన రీతిలో పనులు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా మేయర్ సూచించారు.