పాన్‌షాప్ యజమానిపై సీపీకి ప్రియురాలి ఫిర్యాదు...

పాన్‌షాప్ యజమానిపై సీపీకి ప్రియురాలి ఫిర్యాదు...

హైదరాబాద్‌లోని మయూర్ పాన్‌షాపు యజమాని ఉపేందర్‌పై ప్రియురాలు సోను శర్మ... పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఉపేందర్ తనను పెళ్లి చేసుకొని మోసం  చేశాడని ఆరోపించింది. తాను ఉపేందర్ భార్య ప్రీతితో గొడవకు దిగలేదని... న్యాయం కోసమే వారికి ఇంటికి వెళ్లానని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా తనను వీడియో తీసి అవమానించడాని ఆవేదన వ్యక్తం చేసిన సోను శర్మ... తాను బ్లాక్‌మెయిల్ చేశానని... రూ.40 లక్షలు తీసుకున్నాననే ఆరోపణలు అవాస్తవం అంటోంది. సీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన సోను శర్మ... ఉపేందర్ తనను 2017 సెప్టెంబర్ 13వ తేదీన వివాహం చేసుకున్నాడని... ఆ తర్వాత మోసం చేశాడని ఆరోపించింది. ఉపేందర్ విడుదల చేసిన ఫొటోలపై స్పందించిన ఆమె... నా కాలేజ్ ఫ్రెండ్ తో మొదట నాకు ఎఫైర్ ఉండేదని... మనస్పర్థలు రావడంతో తర్వాత విడిపోయామని... కాలేజ్ ఫ్రెండ్ కావడంతోనే అతడితో చనువుగా ఉన్నానని చెప్పుకొచ్చింది.