19, 20 తేదీల్లో 'జ్ఞాన భేరి'

19, 20 తేదీల్లో 'జ్ఞాన భేరి'

ఈ నెల 19, 20 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ వేదికగా జ్ఞాన భేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు... ఆంధ్రా యూనివర్సిటీలో వీసీ, జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్, జీవీఎంసీ కమీషనర్‌, ఇతర అధికారులతో సమావేశమైన మంత్రి గంటా... ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు 'జ్ఞానభేరి'కి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన తిరుపతిలో నిర్వహించిన జ్ఞాన భేరికి మంచి స్పందన వచ్చిందని... ఆ స్ఫూర్తితో విశాఖలో రెండో కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతీ జిల్లాలోను ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్న మంత్రి గంటా... సుమారు ఇరవై వేల మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా వారితో ఇంట్రాక్ట్ అవుతారని... విద్యార్థుల్లో జ్ఞానభేరి పై అవగాహన కల్పించేందుకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు.