గర్జించిన 'గోదావరి' విద్యార్థులు

గర్జించిన 'గోదావరి' విద్యార్థులు

ఏపీలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను విశాఖలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్‌ 27న పాలీసెట్‌ నిర్వహించగా  కేవలం పదిహేను రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశామన్నారు.  పరీక్షను 1,29,412 మంది విద్యార్థులు రాయగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి పది ర్యాంకుల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు తొమ్మిది మంది ఉండడం విశేషం.