బంగారం వ్యాపారి కిడ్నాప్..

బంగారం వ్యాపారి కిడ్నాప్..

బంగారం వ్యాపారిని ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేసి దాడి చేశారు. అనంతరం వ్యాపారిని పోలీసులకు అప్పగించి పరార్ అయ్యారు. ఈ ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో చోటుచేసుకుంది. గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో చార్మినార్ ప్రాంతానికి చెందిన బంగారం వ్యాపారి దేవేశ్ వద్ద 3.5 లక్షల బంగారంను లక్ష్మణ్ కొనుగోలు చేసాడు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నగల వ్యాపారి దేవేశ్.. ఆరు మంది రౌడీ షీటర్లతో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో లక్ష్మణ్ ఇంటికి వచ్చి అతన్ని కిడ్నాప్ చేసాడు.

దుండగులు కూకట్ పల్లి శివారులో బట్టలు విప్పి చిదకబాదడంతో భయపడ్డ లక్ష్మణ్.. డబ్బులు ఇస్తానంటూ ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడించాడు. అయినా కూడా లక్ష్మణ్ ను  ఎత్తుకొనిపోయారు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు చందానగర్ పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు రంగంలోకి దిగడంతో దుండగులు గత్యంతరం లేక చార్మినార్ పోలీసులకు లక్ష్మణ్ ను అప్పగించి పరార్ అయ్యారు. అయితే కిడ్నాప్ కు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.