బులియ‌న్ జిగేల్‌

బులియ‌న్ జిగేల్‌

బంగారం,వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.  ఢిల్లీ బులియన్ మార్కెట్లో గురువారం నాటి ట్రేడింగ్‌లో రూ.170 పెరిగింది. తాజా పెంపుతో బంగారం ధర నాలుగు రోజుల్లో రూ.660 వరకు పెరిగినట్లయింది. దీంతో  ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 32,120 కు ఎగబాకింది. ఇందుకు లోకల్ మార్కెట్ లో డిమాండ్  ఎక్కువగా ఉండటం వల్లే ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  మరోవైపు... వెండికూడా బంగారం బాటలోనే పయనించింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో వెండి ధర రూ.25 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.37,600 నుంచి రూ.37,625 చేరుకుంది. గత రెండు రోజుల్లోనే రూ.1200 పెరిగిన వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో కాస్త తగ్గాయి. పారిశ్రామిక యూనిట్స్, కాయిన మార్కెట్లలో కొద్దిపాటి డిమాండ్ ఉండటం వల్లే వెండి ధర కొద్దిగా పెరిగిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్ కావటంతో బంగారు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా .. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1238.4 డాలర్ల వద్ద, వెండి ధర 14.39 డాలర్ల వద్ద కొనసాగుతోంది.