ఆకట్టుకున్న హనుమ విహారి

ఆకట్టుకున్న హనుమ విహారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో తెలుగబ్బాయి హనుమ విహారి ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపికగా ఆడిన విహారి.. ఆట ఆఖరికి అజేయంగా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన సమయంలో ఒత్తిడిలో కనిపించినప్పటికీ ఆ తర్వాత కళ్లు చెదిరే షాట్లు కొట్టాడు. క్రీజులోకి వచ్చిన ఐదో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి 29 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన విహారి.. స్టోక్స్‌ వేసిన 45వ ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. కర్రాన్‌ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లు బాదాడు. ఆట ముగిసే సమయానికి  (25 బ్యాటింగ్‌; 50 బంతుల్లో 3x4, 1x6) క్రీజులో ఉన్నాడు.