పంతం ముగిసింది 

పంతం ముగిసింది 

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పంతం. నూతన దర్శకుడు కె చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. దాదాపు నాలుగైదు నెలల పాటు నిరవధిక షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ బాగుండడంతో బాగా వైరల్ గా మారింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలపై ఎక్కుపెట్టి రాసిన డైలాగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ చిత్రం కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు మంచి సోషల్ మెసేజ్ ను ఇచ్చేలా ఉండనుంది. గతంలో చక్రి, డైరెక్టర్ బాబీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. టీజర్ ద్వారానే తానేంటో నిరూపించుకుని సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. మెహ్రిన్ కౌర్ హీరోయిన్ గా నటించడం కూడా ప్లస్. గత నెల చివరి వారంలో మిగులున్న పాటలను ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఈ నెలాఖరుకల్లా నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకుని జులై 5న విడుదల చేయనున్నారు. త్వరలోనే గోపిసుందర్ స్వరపరిచిన పాటలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పంతం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మించారు.