అవినీతి నిరోధక క్లాజ్‌ తొలగింపు!

అవినీతి నిరోధక క్లాజ్‌ తొలగింపు!

అవినీతిని రూపుమాపుతామని వాగ్ధానం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... రాఫెల్‌ ఒప్పందంలో మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు. ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఈ ఒప్పందం నుంచి అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన క్లాజ్ ను తొలగించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనివల్ల ఒకవేళ ఎవరైనా రాఫెల్‌ ఒప్పందంలో అవినీతికి పాల్పడితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరే కొద్ది రోజుల ముందు ఒప్పందం నుంచి ఈ క్లాజును తొలగించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ద హిందూ' పత్రిక ఇవాళ వెల్లడించింది. దీనికి సంబంధించిన కీలక పత్రాలను 'ద హిందూ' బయటపెట్టింది. యూపీఏ హయాంలో జరిగిన ఆయుధాల ఒప్పందాల విషయంలో ఈ కీలక నిబంధన ఉంది. రాఫెల్‌ ఒప్పందంలో మాత్రం  ఈ క్లాజును తొలగించింది ఎన్డీఏ ప్రభుత్వం.