సాయి కృష్ణకు అండగా ఉంటాం

సాయి కృష్ణకు అండగా ఉంటాం

అమెరికాలో దుండగుల కాల్పులలో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం సాయికృష్ణ తల్లిదండ్రులు కేటీఆర్ ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సాయికృష్ణకు అమెరికాలో మెరుగైన చికిత్స అందించాలని ఫోన్ లో అమెరికా హాస్పత్రి సిబ్బందితో కేటీఆర్ మాట్లాడారు. సాయి కృష్ణ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.