హరికృష్ణ విగ్రహంపై వివాదం..

హరికృష్ణ విగ్రహంపై వివాదం..

మాజీ మంత్రి, సినీ నటుడు దివంగ‌త హ‌రికృష్ణ విగ్రహం చుట్టూ వివాదం రాజుకుంటోంది. విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. అనుమతులు తీసుకోకుండా విగ్రహం ఏర్పాటు చేశారంటూ మాజీ ఎంపీ యార్లగడ్డ ల‌క్ష్మీప్రసాద్‌కి గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని.. గుడువులోగా సరైన సంజాయిషీ ఇవ్వకపోతే విగ్రహాన్ని తొలగిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఐతే.. బీచ్‌ రోడ్డులో చాలా మంది విగ్రహాలకు అనుమతులు లేవని యార్లగడ్డ చెబుతున్నారు. కళ, రాజకీయ రంగ ప్రముఖుడి విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని తొలగించే ప్రసక్తే లేదని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.