బీసీసీఐ సరైన పనే చేసిందిః హర్భజన్ సింగ్

బీసీసీఐ సరైన పనే చేసిందిః హర్భజన్ సింగ్

‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ కార్యక్రమంలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. వారిపై విధించిన సస్పెన్షన్ ను సమర్ధించారు. ‘రేపు పొద్దున ఏ పార్టీలోనైనా వారిని కలిస్తే మీరు మాట్లాడుతారేమో కానీ.. నేను మాత్రం మాట్లాడను. అలాగే ఒకే టీమ్‌ బస్సులో కూడా నేను వారితో ప్రయాణించలేను. ఎందుకుంటే నాతో నా భార్య, కూతురు ఉంటుంది. హర్దిక్‌ ప్రతి ఒక్కరి గౌరవాన్ని తీసేలా ప్రవర్తించాడు. జట్టులో మేం ఎప్పుడు ఇలాంటి కల్చర్‌ను సృష్టించలేదు. అంతగా ఖాళీగా ఉంటే నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టాలి. ఖాళీ సమయాల్లో ఏ ఆటగాడు ఏం చేస్తుండో కనిపెట్టాల్సిన అవసరం అవినీతి నిరోధక యూనిట్‌ (ఏసీయూ)కు ఉంది. ఏమైనా ప్రస్తుతం నిబంధనలు కఠినంగానే ఉన్నాయి. భారత జట్టుకు ఓ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఈ తరహా వ్యాఖ్యలతో చెడ్డ పేరు తెచ్చారు. క్రికెట్‌ ఆడే ప్రతి సీనియర్‌కు, జట్టుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. విరాట్‌ కోహ్లి కూడా జట్టంతా వారితో కలిసుండాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.’ అని హర్భజన్‌ స్పష్టం చేశారు. సస్పెన్షన్ పై స్పందిస్తూ.. ‘జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడానికి పాండ్య ఎంత కాలం నుంచి జట్టులో ఉంటున్నాడు? వారిపై ఇలా కఠినంగా వ్యవహరించడమే మంచిది. బీసీసీఐ సరైన పనే చేసింది. వేటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు’ అని హర్భజన్‌ తెలిపాడు.