వాంఖడే ఇద్దరికీ కలిసొచ్చింది

వాంఖడే ఇద్దరికీ కలిసొచ్చింది

రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చి పురాగమనాన్ని ఘనంగా చాటుకుంది చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు. ఐపీఎల్‌-11లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ చేసిన ఓ ట్వీట్‌ ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. 2011లో ముంబయిలోని వాంఖడే మైదానంలో ధోనీ సారధ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ ను సొంతం చేసుకుంది. ఆ జట్టులో ధోని, నేను ఉన్నాం. మళ్లీ ఇప్పుడు అదే మైదానంలో ధోనీ నాయకత్వంలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-11 కప్పును అందుకుంది. ఇప్పుడు కూడా జట్టులో ఇద్దరం ఉన్నాం. దీంతో ముంబైలోని వాంఖడే ఇద్దరికీ కలిసొచ్చిన మైదానం అని హర్భజన్‌ సింగ్‌ గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో పది సంవత్సరాలు ఇద్దరం ప్రత్యర్థులుగానే తలపడ్డాం. అయితే ఐపీఎల్‌-11లో ధోని, నేను ఒక జట్టు తరఫున ఆడతామని ఎవ్వరూ ఊహించి ఉండరని ట్వీటాడు.

Photo: FileShot