గర్వంగా ఉంది బిగ్‌ బ్రో: హార్దిక్‌ పాండ్యా

గర్వంగా ఉంది బిగ్‌ బ్రో: హార్దిక్‌ పాండ్యా

టీమిండియా యువ క్రికెటర్ కృనాల్‌ పాండ్యాను అతని సోదరుడు, భారత ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా ప్రశంశలతో ముంచెత్తాడు. ఆక్లాండ్ వేదికగా ముగిసిన రెండవ టీ20లో కృనాల్‌ పాండ్యా ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోలిన్ మున్రో, డారైల్ మిచెల్, కేన్ విలియంసన్ ల వికెట్లను తీసాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపునకులోనై 158 పరుగులు చేసింది. అనంతరం భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది.

మూడు కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కృనాల్‌ పాండ్యా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఈ  సందర్భంగా 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది బిగ్‌ బ్రో' అంటూ హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు వారిద్దరు కలిసి ఉన్న ఫొటోను కూడా జత చేశాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Proud of you big bro @krunalpandya_official ????????????❤

A post shared by Hardik Pandya (@hardikpandya93) on