మరో బాలీవుడ్‌ భామతో పాండ్య డేటింగ్?

మరో బాలీవుడ్‌ భామతో పాండ్య డేటింగ్?

మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లతో అద్భుత ప్రదర్శన చేసి ప్రేక్షకుల మన్ననలను పొందాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే ఈ మధ్య కాలంలో ఆటతో కాకుండా డేటింగ్ విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు. గతకొంత కాలంగా బాలీవుడ్‌ బ్యూటీ ఎల్లీ అవ్రాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడు హార్దిక్‌. అయితే గతేడాది డిసెంబరు నుంచి డేటింగ్‌లో ఉన్న ఎల్లీతో రెండువారాల క్రితమే పాండ్య విడిపోయాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు బాలీవుడ్ భామ ఇషా గుప్తా(32)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో జన్నత్-2, రాజ్-3, చక్రవర్తి, బేబీ వంటి సినిమాల్లో నటించిన ఇషాతో కలిసి పాండ్యా రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఊర్వశి రౌటేలా అనే బాలీవుడ్ భామతో కూడా డేటింగ్ చేసాడు పాండ్య. మరి ఇషాతో డేటింగ్‌ ఎన్నాళ్ళో అని పలువురు అనుకుంటున్నారు.