కామెంట్స్ పై క్షమాపణ చెప్పిన పాండ్యా

కామెంట్స్ పై క్షమాపణ చెప్పిన పాండ్యా

కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షో‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మహిళలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పారు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమానికి తాజాగా టీమిండియా క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు హాజరయ్యారు. ఈ టాక్ షో‌లో ఇద్దరూ క్రష్, లైప్ స్టైల్ లాంటి అనేక విషయాలను కరణ్‌ జోహార్‌తో పంచుకున్నారు.

కరణ్ జోహార్.. హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి వివరాలు అడిగారు. 'ఈ మధ్య కాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. అమ్మాయిని చూడటం, డేటింగ్‌, రిలేషన్‌షిప్' అని చెప్పుకొచ్చారు. పాండ్యా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపాయి. మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో పాండ్యా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

'కాఫీ విత్‌ కరణ్‌ టాక్ షోలో నా వ్యాఖ్యల పట్ల గాయపడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. నిజానికి ఎవరినీ గాయపరిచే ఉద్దేశం తనకు లేదని. టాక్ షో నేటివిటీని కొనసాగించే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశానని' పాండ్యా వివరణ ఇచ్చుకున్నారు.