మరోసారి కలవనున్న సింగం కాంబినేషన్

మరోసారి కలవనున్న సింగం కాంబినేషన్
తమిళ నటుడు సూర్య కెరియర్ సింగం సిరీస్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లు మాస్ ఎంటర్ టైనర్ గా పర్ఫెక్ట్ కాప్ డ్రామా ప్రేక్షకులను అలరించింది. ఇప్పటివరకు వచ్చిన మూడు పార్ట్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా రానుందని తెలుస్తోంది. దర్శకుడు హరి మాట్లాడుతూ ప్రస్తుతం చేస్తున్న విక్రమ్ తో చేస్తున్న స్వామి స్కోయర్ పూర్తయిన తరువాత సూర్యతో ఓ సినిమా చేయనున్నాను. సింగం సిరీస్ కి కొనసాగింపు కాదు. ఇది సరికొత్త జోనర్ లో చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. ఇక సూర్య గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో NGK సినిమాను చేస్తున్నాడు. గత నెలలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా..ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని పాజిటివ్ హైప్ ను క్రియేట్ చేసుకుంది.