టీఆర్‌ఎస్‌ జనం బాట... కూటమి ఢిల్లీ బాట...

టీఆర్‌ఎస్‌ జనం బాట... కూటమి ఢిల్లీ బాట...

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జనం బాట పడుతుంటూ... మహాకూటమి నేతలు ఢిల్లీ బాట పడుతున్నారంటూ సెటైర్లు వేశారు తాజా మాజీ మంత్రి హరీష్‌రావు... సిద్దిపేటలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన... సిద్దిపేట ప్రజల, కేసీఆర్ ఆశీస్సులతో ఐదు సార్లు గెలిచి ఆత్మీయతను సాధించుకున్నా... ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట అంటే హరీష్ రావు నియోజవర్గం అనే మంచి పేరు సాదించుకున్నా... రాజకీయ నాయకునిగా కాకుండా ప్రజల్లో ఒకడిగా ఉంటున్నానన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు, ఎంత మంది ఉన్నారో కూడా తెలియక ఓట్ల కోసం వస్తున్నారని ఎద్దేవా చేసిన హరీష్‌... కష్టపడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన దగ్గరే ఉండాలన్నారు. నెల రోజులు కేసీఆర్‌, కారు గుర్తును గుర్తు పెట్టుకోంది... నేను ఐదేళ్లు మీ వెంటే ఉంటానని భరోసా ఇచ్చారు.