మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి...

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు మొత్తాన్ని రద్దు చేసి... మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు... హెచ్‌సీఏ మెంబర్ బాబూ రావు... హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌కు షాకిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డివిజన్ బెంచ్... మరో సారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో వివేక్ కొనసాగకూడదని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును స్వాగతించిన బాబూరావు... లోథా కమిటీ సిఫార్సులు పాటిస్తూ సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 

బోర్డు న్యాయబద్ధంగా లేకపోవడం వల్లే నిధులు రావడం లేదని ఆరోపించారు బాబూరావు... అపెక్స్ కమిటీ అనేది సరైన కమిటీ కాదని విమర్శించిన ఆయన... రూరల్‌లో క్రికెట్ అభివృద్ధి సరైన పద్ధతిలో లేదన్నారు. కేవలం హైదరాబాద్‌కే క్రికెట్ డెవలప్‌మెంట్ పరిమితమైందని... అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి దేశానికి క్రికెట్ ఆడే అవకాశాలు లేవని ఆయన వెల్లడించారు. ఇంత అవినీతి జరుగుతుంటే క్రికెట్ అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించిన బాబూరావు... కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా... కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మే31న జనరల్ బాడీ మీటింగ్ జరగాల్సి ఉన్నా... ఇప్పటి వరకు సమావేశానికి ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు.