వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ప్రైవేట్‌ రంగానికి ప్రముఖ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయి. వివిధ రకాల కాల వ్యవధి ఉన్న ఫిక్సెడ్‌ డిపాజిట్లపై 0.05 శాతం నుంచి 0.5 శాతం వరకు వడ్డీని పెంచినట్లు బ్యాంక్‌ తెలిపింది. దాదాపు అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది.