టోల్ గేట్ల వద్ద సంక్రాంతి రద్దీ

 టోల్ గేట్ల వద్ద సంక్రాంతి రద్దీ

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా భాగ్యనగర వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. నేటి నుంచి సంకాంత్రి సెలవులు కావడంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. హైద‌రాబాద్-విజ‌య‌వాడ‌ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల ద‌గ్గర‌ విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు కు 7 గేట్లు, హైదరాబాద్ వైపుకు 5 గేట్లను తెరిచి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.