రామ్ కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే !

రామ్ కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే !

'నేను లోకల్' ఫేమ్ త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో హీరో రామ్ చేస్తున్న సినిమా 'హలో గురు ప్రేమకోసమే'.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి దశ పనుల్లో ఉంది.  ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు.  

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకిగా నటిస్తోంది.  అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదలకానున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  గత కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేని రామ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.