హీరో కొత్త మోటార్ సైకిల్ ఎక్స్ పల్స్ 200టీ

హీరో కొత్త మోటార్ సైకిల్ ఎక్స్ పల్స్ 200టీ

దేశంలో ద్విచక్ర వాహనాల దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ ఇవాళ తన సరికొత్త ప్రీమియం మోటార్ సైకిల్ ఎక్స్ పల్స్ 200టీని ప్రదర్శించింది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఈఐసీఎంఏ ప్రదర్శనలో ఎక్స్ పల్స్ 200టీని ప్రదర్శించినట్టు ప్రకటించింది. ఎక్స్ పల్స్ 200టీ ఒక ‘టూరర్‘ మోటార్ సైకిల్. రెట్రో స్టైలింగ్ లో తయారుచేసిన ఈ కొత్త మోటార్ సైకిల్ లో వాహనదారులకు అత్యాధునిక సాంకేతికత అనుభవం కలగనుంది. 

ఈ మోటార్ సైకిల్ తయారీలో సౌకర్యాలతో పాటు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఎల్ఈడీ హెడ్, టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ అడ్వెంచర్ టూరర్ ఎక్స్ పల్స్ 200, ఎక్స్ పల్స్ 200టీలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది.

ఎక్స్ పల్స్ 200టీ ప్లాట్ ఫామ్ ఆధారంగా నాలుగు రకాల మోటార్ సైకిళ్లను హీరో మోటో కార్ప్ తయారు చేసింది. కేఫ్ రేసర్ కాన్సెప్ట్, డెసర్ట్ కాన్సెప్ట్, స్క్రాంబ్లర్ కాన్సెప్ట్, ఫ్లాట్ ట్రాక్ కాన్సెప్ట్ అనే ఈ నాలుగు మోటార్ సైకిళ్లపై ఓటింగ్ నిర్వహించనుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన కాన్సెప్ట్ మోటార్ సైకిల్ తయారీని ప్రారంభించనుంది.