హైదరాబాద్ అల్లుడు కాబోతున్న హీరో విశాల్

హైదరాబాద్ అల్లుడు కాబోతున్న హీరో విశాల్

విశాల్ హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా మెప్పించాడు.  పందెంకోడి సినిమా ఎంట్రీ ఇచ్చిన విశాల్ మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.  ఇటీవలే రిలీజైన అభిమన్యుడు అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను హిట్టైంది.  ఇప్పుడు తెలుగు టెంపర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.  

ఇదిలా ఉంటె, విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.  ఈ సంగతిని విశాల్ తండ్రి జీకే రెడ్డి అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.  హీరోగా, నడిగరం సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ లు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.  వీటిల్లో నిజం లేదని ఇప్పుడు తేలిపోయింది.  

విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా.  హైదరాబాద్ అమ్మాయి.  ఆమె తండ్రి విజయ్ రెడ్డి.  వ్యాపారవేత్త.  విశాల్, అనీషాల నిశ్చితార్ధం త్వరలోనే జరుగుతుందని, ఈ ఏడాదిలోనే వీరు వివాహం చేసుకుంటారని సమాచారం.