'వినయ విధేయ రామ' ప్రీమియర్ టాక్ !

'వినయ విధేయ రామ' ప్రీమియర్ టాక్ !

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'వినయ విధేయ రామ' ఈరోజే రిలీజవుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయం 3 గంటల నుండే ప్రీమియర్ల రూపంలో సినిమా ప్రదర్శితమైంది.  అన్ని ఏరియాల నుండి చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది.  ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా బాగుందని, బోయపాటి మార్క్ ఇంటర్వెల్ హైలెట్ అని సెకండాఫ్ హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయి పర్వాలేదనిపించిందని అంటున్నారు.  మొత్తానికి ఇప్పటివరకు సినిమాకు మంచి టాక్ రాగా ఇంకొద్దిసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్ ఏమిటనేది స్పష్టంగా తెలియనుంది.