29న హాన‌ర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

29న హాన‌ర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

చైనాకు చెందిన మొబైల్ సంస్థ 'హువావే' త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'హాన‌ర్ వ్యూ20' ని బుధవారం ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో విడుద‌ల చేసింది. భార‌త్‌లో మాత్రం ఈ నెల 29వ విడుద‌ల కానుంది. 8జీబీ ర్యామ్‌, కైరిన్ 980 ప్రాసెస‌ర్‌ను ఉండడంతో.. ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. హాన‌ర్ వ్యూ20 వెనుక భాగంలో 48, 12 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3డీ సెకండ‌రీ రియ‌ర్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్ వేరియంట్లలో లభించనుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 46,070.. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ. 52,550లుగా ఉంది. ఈ నెల 29న అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

ఫీచ‌ర్లు:

# 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే
# 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌
# ఆండ్రాయిడ్ 9.0 పై
# 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌
# 48, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
#  ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌