ఈ బ్యూటీ నాని సినిమాలో వేడి పుట్టిస్తుందట !

ఈ బ్యూటీ నాని సినిమాలో వేడి పుట్టిస్తుందట !

నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జెర్సీ'.  గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది.  క్రికెట్ ఈ సినిమాకు బ్యాక్ డ్రాప్.  లేటు బేసులో క్రికెటర్ గా ఎదగాలనుకునే వ్యక్తిగా నాని ఇందులో కనిపించనున్నాడు.  టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.  ప్రీరిలీజ్ బిజినెస్ కూడా హెవీగా జరిగిందని టాక్.  ఇకపోతే ఈ సినిమాలో ఒక హాట్ హాట్ స్పెషల్ సాంగ్ ఉందట.  అందులో ఆదాశర్మ మెరుస్తుందని అంటున్నారు.  పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుని సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హడావుడి చేసే అదా శర్మ ఈ ప్రత్యేక గీతంలో ఎలా వేడి పుట్టిస్తుందో చూడాలి.