హువావే నుంచి మరో స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి మరో స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. 'హువావే ఎంజాయ్ 9'ను త్వరలో విడుదల చేయనుంది. ఎంజాయ్ 8 సిరీస్ సక్సెస్ అవడంతో ఎంజాయ్ 9 సిరీస్ ను తీసుకొచ్చింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.12,316 లుగా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గల స్మార్ట్‌ఫోన్ ధర  సుమారు రూ.15,397 లుగా ఉంది. అయితే రెండు వేరియంట్లలో 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సదుపాయం ఉంది.

ఫీచర్లు:

# 6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ (512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
# 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
#  8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
#  3900 ఎంఏహెచ్ బ్యాటరీ