హాక్ ఐ యాప్ తో సెల్ ఫోన్లు రికవరీ

హాక్ ఐ యాప్ తో సెల్ ఫోన్లు రికవరీ

హైదరాబాద్ లో సెల్ దొంగల ముఠా గుట్టును రట్టు చేసారు సీటీ పోలీసులు. హాక్ ఐ యాప్ ద్వారా పోయిన సెల్ ఫోన్లను కనిపెట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. 2లక్షల విలువైన ఫోన్లను గుర్తించిన అధికారులు,ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా భాదితులకు ఫోన్లు  అంద చేశారు. హాక్ ఐ యాప్ ద్వారానే 35 విలువైన ఫోన్ల ఆచూకీని సిటీ పోలీసులు కనిపెట్టగలిగారు. హాక్ ఐ యాప్ ను నగరంలో 9లక్షల మంది ఉపయోగిస్తున్నారని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని సిపి కోరారు. ఈ యాప్ ద్వారానే గత మూడు నెలల్లో 24 ఫోన్స్ రికవరీ చేయగలిగామన్నారు అంజనీకుమార్. 

హైదరాబాద్ సిటీ పరిధిలో 2లక్షలకు పైగా సీసీటీవీలు ఉన్నాయని తెలిపిన సీపీ, ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే  34 పోలీస్ స్టేషన్లలో  ప్రత్యేక టీమ్ లు పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేక టీమ్ లు అందుబాటులోకి వస్తాయన్నారు సీపీ అంజనీ కుమార్. నగరంలో ప్రతి ఇళ్ళు సేఫ్టీగా ఉండాలని..  గ్రేటర్ ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.