గణేష్ ఉత్సవాలకు 14వేల పోలీసు సిబ్బంది

గణేష్ ఉత్సవాలకు 14వేల పోలీసు సిబ్బంది

ప్రజలు ప్రశాంత వాతావరణం నడుమ వినాయక చవితి జరుపుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 14 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 8వేల మండపాలకు సిటీ పోలీస్ యాప్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయని, ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని సీపీ తెలిపారు. నగర పోలీస్ ఈసారి వాట్స్ అప్ యాప్  టెక్నాలజీ ద్వారా అన్ని వినాయక మండపాలకు  భద్రత, నిఘ, క్యూ ఆర్ కోడ్  ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బాలాపూర్ వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర సాగే 18 కిలో మీటర్ల రూట్ మాప్ లో గట్టి భద్రతతో పాటు,  మొత్తం 450 సిసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.