పల్లెబాట పడుతున్న జనం

పల్లెబాట పడుతున్న జనం

హైదరాబాద్ నగరంలోని జనం పల్లెబాట పడుతున్నారు. శుక్రవారం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ఉండడంతో.. సొంత గ్రామాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. దీనికి తోడు వరుస సెలవులు కూడా రావడంతో ఓటర్లుకు కలిసివచ్చింది. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్ లలో బస్సుల కోసం ప్రయాణికులు వేచిచూస్తున్నారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ బస్టాండ్, ఎల్బీనగర్ రింగ్ రోడ్డు, ఉప్పల్ రింగ్ రోడ్డు, జేబీఎస్ లలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. బస్సులను పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు చేసేదేంలేక కిక్కిరిసిన బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. రేపు ఉదయం ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాణీకులకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. టీఎస్ ఆర్టీసీ జనంకు అనుగుణంగా బస్సులను నడిపితే గాని ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పేలాలేవు.