కొన్నేళ్లకైనా సీఎంనవుతా..

కొన్నేళ్లకైనా సీఎంనవుతా..

ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ముఖ్యమంత్రినవుతానని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి వచ్చినా తీసుకోనని.. తనకు వయసు ఉందని, ఓపిక ఉందని, తన లక్ష్యం సీఎం పదవేనని చెప్పారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తామంటున్నారని, కానీ తనకు ఆ పదవి అవసరం లేదని అన్నారు. తన హోదాకు తగిన పదవివ్వాలని, మరే పదవిచ్చినా పని చేయలేనని, అవసరమైతే పార్టీకి సామన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు ఇచ్చారని చెప్పారు. అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. ఓటుకు నోటు కేసు విషయాలను కాంగ్రెస్‌లో చేరేటప్పుడే రాహుల్‌ గాంధీకి చెప్పానని రేవంత్‌ వివరించారు. తన పనితీరు తెలిసినప్పటికీ టీపీసీసీ బాస్ తనను సరిగా వాడుకోవడం లేదని, ఆయన సలహాలిచ్చేవారు సరిగా లేరని రేవంత్‌ అన్నారు. కొమటిరెడ్డి, సంపత్‌లకు దీక్ష చేయమని తానే సలహా ఇచ్చానని చెప్పారు.